ప్రఖ్యాత ప్రసిద్ధి గాంచిన పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం దేవాలయానికి వచ్చిన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిపై ఓ దుండగుడు కాల్పలు జరిపారు. దీంతో అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తృటిలో తప్పించుకుని ప్రాణాలలో బయటపడ్డాడు.అతని అనుచరులు కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు.
నిందితుడిని నారాయణ్ సింగ్‌గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఉదయం రద్దీగా ఉన్న స్వర్ణదేవాలయంలో కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అరుపులు, కేకలతో పరుగులు తీశారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుడిని స్థానిక పీఎస్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
స్వర్ణదేవాలయంలో కాల్పుల కలకలం
— శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిపై ఫైరింగ్
— సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దుండగుడి కాల్పులు
— అడ్డుకున్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అనుచరులు
— సుఖ్బీర్కు తృటిలో తప్పిన ప్రమాదం
— నిందితుడు నారాయణ్ సింగ్‌గా గుర్తింపు
— పోలీసుల అదుపులో నారాయణ్ సింగ్… pic.twitter.com/BYFse8pKar— RTV (@RTVnewsnetwork) December 4, 2024