అఖిలేశ్ యాదవ్‌కు బిగ్ షాకిచ్చిన యోగి.. 9స్థానాల్లో 7చోట్ల ఆధిక్యం

-

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా.. కాషాయ పార్టీ శ్రేణులు 7 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మిగతా 3 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు.

గతంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాజీనామా చేసిన కర్హల్ స్థానంతో పాటు, సిసామౌలో ఎస్పీ లీడింగులో కొనసాగుతోంది. ఇక 7 స్థానాల్లో బీజేపీ దాని మిత్రపక్షం ఆర్‌ఎల్డీ ముందంజలో కొనసాగుతున్నాయి. కాగా, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 37 స్థానాల్లో సొంతంగా గెలిచి దూకుడు మీదున్న సమాజ్ వాదీ పార్టీకి తాజాగా బైపోల్స్ ఫలితాలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ షాకిచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version