పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఎంట్రీ.. మేజర్ తోనే..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో చాలా వరకూ వారసత్వంగా వచ్చినవారే. ఐతే తాజాగా మరో వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీకి పరిచయం అవనున్నాడు. గత కొన్ని రోజులుగా అకిరా నందన్ ఎంట్రీ గురించి అనేక వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం అకిరా నందన్ ఒకానొక సినిమాలో అతిధిగా కనిపించనున్నాడట.

అడవి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాలో అకిరా నందన్ కనిపించనున్నాడని అంటున్నారు. ఇటీవల లుక్ టెస్ట్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న మేజర్ సినిమా ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. 2008 నవంబరు 26వ తేదీన ముంబై తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో సందీప్ అమరుడయ్యాడు. ఇప్పుడు ఆయన జీవితంపై మేజర్ అనే సినిమా రూపుదిద్దుకుంది. మరి ఈ సినిమాలో అకిరా నందన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news