డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న “ది ఘోస్ట్” చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు ది గోస్ట్ అనే టైటిల్ పెట్టి క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర బృందం.
ఇక ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ గా ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తోంది చిత్ర బృందం. కర్నూల్ లోని STBC కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్ కు అఖిల్ అక్కినేని, నాగ చైతన్య హాజరుకానున్నారట. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.
Let the madness begin❤️🔥
The Akkineni Trio are gracing #TheGhost 's Pre-Release Event ⚔️
🎟️https://t.co/J3eeGZQOXX
📍S.T.B.C College Grounds, Kurnool
🕰️ 6PM #TheGhostOnOct5@iamnagarjuna @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @SonyMusicSouth @shreyasgroup pic.twitter.com/ldajPDaYT9— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) September 23, 2022