అల వైకుంఠపురములో ఖాతాలో మరో రికార్డు..

-

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డునిక్రియేట్ చేయడంతో పాటు సంగీత పరంగా సంచలనాలు నమోదు చేసింది. ఇందులోని ప్రతీ పాట ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఇప్పటికే వన్ బిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ పాటలు తాజాగా అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లో ఎక్కువ స్ట్రీమింగ్ వ్యూస్ తెచ్చుకున్న ఆల్బమ్ గా రికార్డుకెక్కాయి.

2020లో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడ్డ పాటలుగా అల వైకుంఠపురములో పాటలు రికార్డుని సెట్ చేసాయి. ఈ మేరకు సంగీత దర్శకుడు థమన్ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నాడు. సామజవరగమనా మొదలుకుని రాములో రాములా, బుట్టబొమ్మ మొదలగు పాటలు జనబాహుళ్యంలోకి భాషాభేదం లేకుండా దూసుకెళ్ళాయి. బుట్టబొమ్మ పాటయితే ఖండాలు దాటి మరీ పాపులారిటీ తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news