కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధిలోకి వచ్చింది. ఏ పనైనా చిటికెలో పూర్తి చేసే టెక్నాలజీ ప్రస్తుతం అందరి చేతిలో ఉంది. ఈ స్మార్ట్ యుగంలో ప్రతిఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లతో వ్యక్తిగత వివరాలు, బ్యాంకుల వివరాలు భద్రపరచుకునే సదుపాయం కలదు. ఒక్క బటన్ క్లిక్ చేస్తే చాలు ప్రతీ విషయం అందుబాటులో ఉండే టెక్నాలజీ ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరాలు చాలా వరకు పెరిగాయి. కొందరు హ్యాకర్లు కొన్ని రకాల యాప్‌లలో చొరబడి.. వాటి ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ప్రతి డాటాను తెలుసుకునే ప్రమాదం ఉంది. ఫేక్ అప్‌డేట్ నోటిఫికేషన్ పంపుతూ.. దాని ద్వారా మీ స్మార్ట్ ఫోన్లలో చొరబడుతున్నారు. మాల్‌వేర్, స్పైవేర్ వంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సాయంలో లింకులను పంపుతూ హ్యాకర్లు ఈజీగా తమ పని తాము ముగించుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో మాల్‌వేర్ ఫేక్ సిస్టమ్ అప్‌డేట్ ఆప్షన్‌తో హ్యాకర్లు డేటా చోరికి పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో మాల్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్ చూపించి మీ ఫోన్ అనుమతులను హ్యాకర్ తన నియంత్రణలో తీసుకునే ప్రమాదం ఉంది. మీ ఫోన్‌లో ఉన్న పర్సనల్ డేటా, ఫోటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వ్యవహారాలు వంటి సమాచారాన్ని ఐపీ అడ్రస్ ద్వారా ఈజీగా హ్యాక్ చేయవచ్చు. జింపెరియం, మాల్‌వేర్ బైట్స్ ల్యాబ్ స్మార్ట్ ఫోన్ల భద్రతా పరిశోధన నిర్వహించారు. ఇందులో ఒక మాల్‌వేర్‌ను కనుగొన్నారు. స్మార్ట్ ఫోన్ యూజర్లకు అప్‌డేట్ నోటిఫికేషన్ పంపి వారి మొబైల్ ఫోన్‌లో చొరబడుతున్నారు. అలా స్మార్ట్ ఫోన్‌లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ చేతికి అందేలా మాల్‌వేర్ ఉపయోగపడుతోంది.
సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ ప్రకారం.. ఈ ఫేక్‌సిస్ అప్‌డేట్ స్పైవేర్ ఇంటర్నెట్‌లో ఎలా వ్యాపించిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఈ మాల్‌వేర్ గూగుల్ యొక్క ప్లే స్టోర్ ద్వారా కూడా వ్యాపించలేదని సైబర్ భద్రతా సంస్థలైన జింపెరియం, మాల్‌వేర్ బైట్స్ ల్యాబ్ పేర్కొన్నాయి. అయితే వినియోగదారుల భద్రతను పెంచడానికి స్పియర్ ఫిషింగ్‌ను ఉపయోగిస్తున్నట్లు, మాల్‌వేర్ అప్‌డేట్ వంటి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చిన యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.