ఆ బ్యాంక్ కస్టమర్స్ కి అలెర్ట్… ఈ రూల్స్ మారాయి చూసుకోండి..!

-

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సర్వీసులని అందిస్తోంది. మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే మీరు తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి. తాజాగా స్టేట్ బ్యాంక్ కొన్ని రూల్స్ ని మార్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

బ్యాంక్ తాజాగా కొన్ని రూల్స్‌ను సవరించింది. ఆన్‌‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ నిబంధనలను మార్చింది స్టేట్ బ్యాంక్. అందువల్ల ఎస్‌బీఐ‌ ఖాతాదారులు వీటిని తెలుసుకోవాలి. ఎస్‌బీఐ ఐఎంపీఎస్ రూల్స్‌ను సడలించింది. లిమిట్‌ను పెంచింది. స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఐఎంపీఎస్ విధానంలో ఇకపై రూ.5 లక్షల వరకు డబ్బులు పంపొచ్చు అని స్టేట్ బ్యాంక్ అంది.

బ్యాంక్ కస్టమర్లు ఐఎంపీఎస్ ద్వారా క్షణాల్లో ఇతరులకు రూ.5 లక్షల వరకు పంపొచ్చు. డబ్బులు కూడా వెంటనే చేరిపోతాయి. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని బ్యాంక్ అంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా చేసే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

స్టేట్ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు పంపాలని అనుకుంటే కనుక పాత విధానంలోనే చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ చార్జ్, జీఎస్‌టీ పడుతుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు స్లాబ్ ఒకటి కొత్తగా యాడ్ అవుతుంది. దీనికి రూ.20 చార్జీ, జీఎస్‌టీ పడుతుంది.

ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. రూ.1000 వరకు చార్జీలు ఉండవు. రూ.1000 నుండి రూ.10 వేల వరకు రూ.2 + జీఎస్‌టీ, రూ.10 వేలకు పైనుంచి రూ.లక్ష వరకు అయితే రూ.4 + జీఎస్‌టీ, రూ.లక్షకు పైనుంచి రూ. 2 లక్షల వరకు అయితే రూ.12 + జీఎస్‌టీ, రూ.2 లక్షలకు పై నుంచి రూ.5 లక్షల వరకు రూ.20 + జీఎస్‌టీ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version