పెళ్లికి ముందే గర్భం దాల్చానంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన అలియా..!

-

ప్రముఖ బాలీవుడ్ నటి సొట్టబుగ్గల సుందరి అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా చిత్రంలో కూడా నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈమె బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియాలో పాపులారిటీ దక్కించుకున్న అలియా భట్ రణబీర్ కపూర్ ను గత ఏడాది ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించి వివాదాలకు చోటు ఇచ్చిన అలియాభట్ పెళ్లయిన ఎనిమిది నెలలకే ప్రసవించింది.

దీంతో వివాహానికి ముందే గర్భం దాల్చింది అంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ విషయంపై వీరు స్పందించే ప్రయత్నం చేయలేదు. అటు ఆలియా ఇటు రణబీర్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ఎక్కడ బయట ప్రస్తావించలేదు. అయితే ఇదంతా జరిగి దాదాపు రెండు నెలల పైనే అవుతున్న ఇప్పటికీ ఈ విషయంపై ఎక్కడో ఒకచోట వార్తలు వస్తూనే ఉన్నాయి అందుకే ఈ విషయంపై స్పందిస్తూ నిజమే పెళ్లికి ముందే గర్భం దాల్చాను అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది అలియా.

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. వివాహానికి పూర్వం హాలీవుడ్ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. అయితే అదే సమయానికి నేను ప్రెగ్నెంట్ కావడంతో యాక్షన్ సీన్లను చేయడానికి ఇబ్బంది పడ్డాను. దీంతో ఇదే విషయాన్ని చిత్రం యూనిట్ కి తెలియజేయగా వారు యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంటూ అలియా వివరించింది. ఆలియా ఒక హాలీవుడ్ సినిమాలో నటించినప్పుడు ప్రెగ్నెంట్గా తొలి రోజుల్లోనే తాను షూటింగ్లో పాల్గొన్న వైనం గురించి కూడా మీడియాతో వివరించింది. మొత్తానికైతే ఈమె ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version