వారంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారని.. అప్పటివరకు జనసైనికులు సంయమనం పాటించాలని ఆ పార్టీ నేత నాగబాబు కోరారు. ఇటీవల వన్నెపూడిలో జరిగిన ఉదంతం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు సేకరిస్తున్నాం. పార్టీకి సంబందించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి కూడా మాకు సమాచారం ఉన్నది. ఈ విషయంపై ఏరాపురం కో ఆర్డినటర్ మండ్డి శ్రీనివాస సరృత్వంలోని స్థానిక నాయకులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు. జన సైనికులంతా సంయమనం పాటించాల్సిన సమయం ఇది. పవన్ కళ్యాణ్ ఎన్టీఏలో కీలక భూమిక పోషిస్తున్న తరుణంలో.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చక్కబెట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఇంకో వారం రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం రానున్నారు.
ఏరాపురం కో ఆర్డినటర్ శ్రీ మరడ్డి శ్రీనివాస్ పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటారు. సీరాపురం ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండే విదంగా ఏరాపురంలో జనసిన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధులై ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం. సాధ్యమైనంత వరకు నేను కూడా పిఠాపురంలో’ అందుబాటులో ఉంటాను. జన సైనికులు నీరంతరం ప్రజా క్షత్రంలోనే ఉంటారన్న సంగతి తెలిసింది. సమస్యలు ఏవైనా ఉంటి అందరం కూర్చొని పరిస్కారం అయ్యే విదంగా ప్రణాళికలు రూపొందించుకుందాం. ముఖ్యంగా పిఠాపురంలో సాగు నీరు, తాగు నీరు కొరతను అధిగమించాల్సిన అవసరం ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. సుద్దగడ్డ రిజర్వాయర్ పనులపై పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నారు.