ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయన్ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని పోలీసులు భావించారు. అయితే, బన్నీ అభిమానులు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉండటంతో లొకేషన్‌ను గాంధీ ఆస్పత్రికి మార్చినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, ముందస్తు బెయిల్ కోసం బన్నీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. దీనిపై కోర్టు విచారణ జరిపి ఆయనకు బెయిల్ ఇవ్వకపోయినట్లు అయితే, అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించనున్నారు. దీంతో మూడు రోజుల పాటు ఆయన జైలులో ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదా రిమాండ్ విధిస్తుందా? అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు బన్నీని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున చిక్కడపల్లి పీఎస్ వద్దకు చేరుకుంటున్నారు.