ఆ దర్శకుల సినిమాల్లో నటించాలని ఉంది…ఆమని..!

-

సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆమెని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆనాటి కాలంలో అనేక హిట్, సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఆమని తెచ్చుకుంది. ఆమని ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ శుభలగ్నం, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం సినిమాలు గొప్ప గుర్తింపు ను తీసుకువచ్చాయి.

ఇలా టాలీవుడ్ లో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ఆమని కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చందమామ కథలు సినిమాతో ఆమని తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమని వరుస సినిమాల్లో నటిస్తోంది. ఆమని సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్ లలో కూడా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె అల్లంత దూరాన అనే సినిమాలో అతిధి పాత్రలో నటించింది. విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాస్‌ ఈ సినిమాలో జంటగా నటించారు.

ఈ సినిమాను చలపతి పువ్వల దర్శకత్వంలో కోమలి సమర్పణలో ఎన్‌. చంద్రమోహనరెడ్డి నిర్మించారు, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంలో ఆమని మాట్లాడుతూ… నా మేనకోడలు హ్రితిక పెద్ద డైలాగ్‌ని కూడా సింగిల్‌ టేక్‌ లో చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక నటికి ఎన్ని రకాల పాత్రల్లో నటించిన సంతృప్తి రాదు. ఇంకా ఏదో చెయ్యాలి అని ఉంటుంది. మణిరత్నం, రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్‌ గారి సినిమాల్లో నటించాలని ఉంది అని ఆమెని తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version