పేరుకే అగ్రరాజ్యమా…..అమెరికా తీరుపై ఫైర్ అవుతున్న నెటిజన్లు

-

ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం గా పిలవబడే దేశం అమెరికా. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకొనే అమెరికా కేవలం పేరుకు మాత్రమే అగ్రరాజ్యం గా నిలుస్తుంది అని,విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం కనీసం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా లేదు అంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. అగ్రరాజ్యం కేవలం మాటలకే పరిమితం అయ్యేలా ఆ దేశం ప్రవర్తిస్తుంది. దీనితో అక్కడి ప్రజలు సైతం కౌంటర్ లు వేసే పరిస్థితికి వచ్చేశారు అంటే అసలు విషయం అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ వైరస్ తీవ్రత అత్యధికంగా ఉండటంతో అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. అయితే కరోనా వస్తే దానిని అలా కంట్రోల్ చేస్తాం,ఇలా కంట్రోల్ చేస్తాం అంటూ బీరాలు పలికిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వైరస్ సోకిన తోలి రోజుల్లోనే మాస్కులు,శానిటైజేషన్లు అందరికి అందించలేక చేతులు ఎత్తేసారు. అయితే ఇప్పుడు తాజాగా ఆసుపత్రిలో పని చేసే నర్సులకు డాక్టర్ల కు కావాల్సిన కనీస సదుపాయాలను కూడా అగ్రరాజ్యం అందించడం లో విఫలమైంది అని చెప్పాలి. కోవిడ్‍19 నుంచి రక్షణ పొందేందుకు ప్రొటెక్టివ్‍ సూట్‍లు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు కూడా వైరస్‍ సోకుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నామని అమెరికాలో వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా సూట్‍లు, మాస్క్లు, గ్లౌజ్‍లు, గౌన్లు, కంటి అద్దాల కొరత ఉన్నట్లు ఆసుపత్రుల్లో పని చేసే నర్సులు,డాక్టర్లు చెబుతున్నారు. క్టర్లకు కూడా కావాల్సినన్ని ప్రొటెక్టివ్‍ ఎక్విప్మెంట్‍ లేదంటున్నారు. పాత మాస్క్లను రిసైకిల్‍ చేసి వాడుతున్నామని, తమను తాము రక్షించేందుకు ట్రాష్‍ బ్యాగ్‍లను శరీరంపై కప్పుకుంటున్నట్లు వారు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. ఇంత బహిరంగంగానే వైద్య బృందాలు చెబుతున్నప్పటికీ అధ్యక్షులు మాత్రం ఏ విధంగానూ వారికి కావాల్సిన వైద్య పరికరాలను మాత్రం అందించలేకపోతున్నారు.

కోవిడ్‍19 పేషెంట్లకు వైద్య చికిత్సలు అందించాలంటే అనేక వైద్య పరికరాలు అవసరమని, ఒకవేళ సరైన ప్రొటెక్టివ్‍ ఈక్విప్మెంట్‍ లేకుంటే వైరస్‍ అందరికీ వ్యాపిస్తుందని వారంతా వాపోతున్నారు. వ్యక్తిగత సూట్లు లేనంత వరకు వైరస్‍ వ్యాప్తిని అరికట్టడం కష్టమే అని నర్సులు అంటున్నారు. మరి దేశాలకే పెద్దన్నగా చెప్పుకొనే అగ్రరాజ్యం ప్రజలను కాపాడాలని చూస్తున్న వైద్య బృందానికి కావాల్సిన కనీస వైద్య పరికరాలను అందించలేకపోవడం పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి తో అమెరికా లో 1000 మందికి పైగా మృత్యువాత పడగా, వేలమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version