ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయనకు సంబంధించిన ప్రసారాలను అమెరికా మీడియా ఆపేసింది. ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసాయని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఎన్నికల రాత్రి నుంచి డోనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శ్వేతసౌధంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తూ… ట్రంప్ 17 నిమిషాల ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేయగా…
అసలు వాటికి ఏ ఒక్క దానికి ఆధారాలు లేవు అని మీడియా పేర్కొంది. ఎంఎస్ఎన్బిసి యాంకర్ ఒకరు ట్రంప్ దెబ్బకు మా మీద విమర్శలు వస్తున్నాయని అందుకే ఆపెసామని చెప్పారు. ఎన్బిసి మరియు ఎబిసి న్యూస్ కూడా ట్రంప్ ప్రత్యక్ష ప్రసారానికి తీసేసాయి. ఎన్నికలను దొంగిలించడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఎంత తప్పు అంటూ సిఎన్ఎన్ ఆరోపించింది.