మూడో పెళ్లికి సిద్దమైన బాలీవుడ్ స్టార్!

-

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ మూడో పెళ్లికి రెడీ అయ్యాడట. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమిర్ ఇప్పుడు ఓ బీ టౌన్ హీరోయిన్​ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతకొంత కాలంగా ఆమిర్.. దంగల్‌ నటి ఫాతిమా సనా షేక్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన రెండో భార్య కిరణ్‌ రావుతో విభేదాలు రావడానికి కారణం కూడా ఫాతిమానే అని బాలీవుడ్‌ మీడియా బల్ల గుద్ది మరీ చెప్పింది. ఇప్పుడు ఆమిర్ మూడో పెళ్లికి సంబంధించిన చర్చలు బీ టౌన్​లో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఆమిర్ ఖాన్ పెళ్లిపై రాఖీ సావంత్‌ చేసిన వ్యాఖ్యలు వీరి రిలేషన్​షిప్​పై వస్తున్న రూమర్స్​కు మరింత ఆజ్యం పోశాయి. లేటెస్ట్‌గా జరిగిన ఐఫా వేడుకల్లో బీటౌన్‌లో ముగ్గురు హాట్టెస్ట్‌ యాక్టర్స్‌ ఎవరు అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు రాఖీ సావంత్‌.. షారుఖ్‌, సల్మాన్‌.. మూడో వ్యక్తి మూడో పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ అయి ఉండొచ్చని చెప్పింది. ఆ తర్వాత తన స్టేట్‌మెంట్‌ను ఉద్దేశిస్తూ సారీ ఆమిర్‌.. ఐ లవ్‌ యూ అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవడంతో ఆమిర్‌ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు బీ టౌన్ కోడై కూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news