ఫార్ములా-ఇ రేసు.. కేటీఆర్‌కు ఆనంద్‌మహీంద్రా ధన్యవాదాలు

-

ఫార్ములా-ఇ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సినీ నటులు మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్, అడివి శేష్ ఫార్ములా-ఇ రేస్‌ నిర్వహించడం పట్ల కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఆ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేరారు.

ఫార్ములా-ఇ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్‌ ఆవిర్భవించిందని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా శుక్రవారం ట్విటర్‌లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version