అనసూయ అందం చూడతరమా… మరి ఇంత హాట్ గానా…

-

జబర్థస్త్ భామ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై తన సత్తాను చాటుతోంది. జబర్థస్త్ ద్వారా పాపులర్ అయిన ఈ భామ వరసగా భారీ సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది. 

తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ఎప్పటికప్పుడు ఆమె అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన అందంతో మెస్మరైజ్ చేసింది. రెడ్, గ్రీన్ కాంబినేషన్ డ్రెస్సింగ్ తో అదరగొడుతోంది ఈ భామ. ఏజ్ 35 ప్లస్ కు చేరినా… తన అందంతో ఎప్పుడూ కొత్తగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి తన హాట్ పిక్స్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఎక్కువగా సోషల్ మీడియాలో తన అభిమానులు, ఫాలోవర్లకు అందుబాటులో ఉండే అనసూయపై ట్రోలింగ్స్ కూడా ఎక్కువగానే నడుస్తుంటాయి. అయినా… ఈ జబర్థస్త్ బ్యూటీ వీటన్నింటిని పెద్దగా పట్టించుకోదు. నెటిజెన్ల కామెంట్లకు దిమ్మదిరిగే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. 

ఇటీావల కాలంలో సినిమాలో వరస అవకాశాలతో దూసుకుపోతోంది. గతంలో ‘ రంగస్థలం’ లో రంగమ్మత్త పాత్రలో ఎంతో పేరు తెచ్చుకుంది. తాజాగా ‘ పుష్ప1’లో ద్రాక్షాయణి పాత్రలో నెటిగివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను పోషించింది. 

పుష్ప1లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా.. పుష్ప 2లో మాత్రం అనసూయదే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో కొన్ని సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ‘ ఆచార్య’ తో పాటు ‘ పక్కా కమర్షియల్’, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version