అనసూయ తల్లా పెళ్ళామా…?

-

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ యాంకర్ అనసూయ. ప్రస్తుతం ఆమె చాలా బిజీ అయిపోయింది. యాంకర్ గా చాలా షోస్ లో చేస్తుంది. ఇక సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ మమ్మీ. వరుసగా ఆఫర్లు రావడంతో ఆమె బిజీ బిజీ అయిపోతుంది. మంచి అవకాశాలు వస్తే మాత్రం వదులుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు అనసూయ. ప్రస్తుతం టాలీవుడ్ లో సుమను బీట్ చెయ్యాలని భావిస్తుంది. ఇందుకోసం సినిమా ఈవెంట్స్ కూడా చెయ్యాలని చూస్తుంది.

ఇప్పుడు ఆమె యాంకర్ గా మరో షో చేయడానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. ఆమె యాంకర్ గా జెమినీ టీవీలో కొత్త ప్రోగ్రాం త్వరలో రానుంది. మార్చి 2వ తేదీ నుంచి కొత్తగా ‘తల్లా? పెళ్లామా?’ అనే షో ప్రారంభం అవుతుంది. ఈ షో ప్రతి సోమవారం రాత్రి 9.30 గంటలకు వస్తుంది.మరి ఏ విధంగా షో ఉంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఇది ఒకవేళ కామెడి షో నా లేక ఇంకేదైనా అంటూ పలువురు ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు.

లేక బతుకు జట్కా బండి టైపు లో ఏమైనా వస్తుందా అనేది తెలియకపోయినా టైటిల్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా బతుకు జట్కా బండి అనే ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ షో కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు అంటున్నారు. అనసూయ కూడా మనలాగే కన్‌ఫ్యూజ్ అయినట్టుంది. అందుకే ‘తల్లా? పెళ్ళామా? అస్సలేంటి ఈ షో? మీకేమైనా తెలుసా?’ అంటూ జెమినీ టీవీ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేసి వెరైటీ ఈమోజీలు పెట్టింది.

https://twitter.com/anusuyakhasba?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1232634466289385473%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fanchor-anasuya-bharadwaj-to-host-a-new-show-talla-pellama-in-gemini-tv-ba-463242.html

Read more RELATED
Recommended to you

Exit mobile version