ఓటర్ ను చెంప దెబ్బ కొట్టడం పై స్పందించిన ఎమ్మెల్యే..!

-

అధికార వైసీపీ తిక్క తీరేలా ఓ ఓటర్ చెంప పగలగొట్టడం గుంటూరులో చర్చనీయాంశం అయింది. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌  క్యూలైన్లో నిలబడి ఓటు వేయకుండా.. నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆయన  గమనించి ఓ ఓటర్ లైన్ లో నిల్చొని ఓటు వేయాలని సూచించారు. ఆగ్రహానికి గురైన శివకుమార్ ఓటర్‌పై దాడికి దిగారు. ఓటర్ చెంప పగలగొట్టారు. ఓటర్‌తోపాటు మిగతా వారు తిరిగి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు.

తాజాగా పోలింగ్ స్టేషన్ లో ఓటర్ ను చెంపదెబ్బ కొట్టడం పై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్ వివరణ ఇచ్చారు. ” నేను, నా భార్య ఓటేసేందుకు వెళ్లాం. గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎస్సీలు, మైనారిటీలకు అంటకాగవాడు వచ్చాడు అని దూషించాడు. అతడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడని అక్కడ ఉన్న ఓటర్లు కూడా చెప్పారు. అందుకే కోపంతో కొట్టానని ఎమ్మెల్యే చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version