పోలింగ్ రోజు పల్నాడులో జరిగిన ఘర్షణలకు సంబంధించిన కేసులో మొత్తం 1,200 మందిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిని ఉంచడానికి నరసరావుపేట జైలు సరిపోవడం లేదని.. వారిని రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నామని చెప్పారు.
గొడవల కారణంగా పల్నాడు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిందని.. గొడవల ఫేమస్ కావడం బాధగా ఉందని మలికా గార్గ్ తెలిపారు. కాగా, ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే .పోలీసుల కళ్లు గప్పి తిరుగుతూనే పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతి రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించింది.