పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌

-

పోలింగ్‌ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండో రోజూ కొనసాగడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఈ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్‌ పోలీసు శాఖకు ఉత్తర్వులు ఇచ్చారు.

నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని శివశంకర్ తెలిపారు. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమిగూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించ కూడదని, అనుమానాస్పదంగా సంచరించ కూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ రోజున ఈ జిల్లాలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన విషయం తెలిసిందే. మరుసటి రోజు కూడా ఈ గొడవలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version