వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు అయింది. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పొస్టింగులపై ఫిర్యాదు చేశారు స్థానిక కౌన్సిలర్. అయితే.. ఆ కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు.. ఇప్పటికే యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పోలీస్ స్టేషన్లలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎలక్షన్ సమయంలో పెండింగ్ లో ఫిర్యాదులపై సైతం కేసులు నమోదు చేశారంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. దీనిపై పోరాటం చేస్తామన్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ,అసభ్య కామెంట్లు చేస్తున్న వైసీపీ కార్యకర్త సుధారాణి అరెస్ట్ అయ్యారు.