BREAKING : ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఏపీ వ్యాప్తంగా క్రీడా సంబరాలు జరుగనున్నాయి. ఇవాళ క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించాలని ఆదేశించారు.
క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు ఉంటాయని చెప్పారు. బాలురు, బాలికలకు పోటీలు ఉంటాయని వివరించారు. దీంతో పాటు 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు సీఎం జగన్. సచివాలయాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి వరకు మ్యాచ్‌లు ఉందనున్నాయి. మొత్తం 46 రోజుల పాటు ఆటలు నిర్వహించాలని ఆదేహించారు సీఎం జగన్. అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు అందించే లక్ష్యంతో… 100 జియో టవర్లను CM జగన్ వర్చువల్ గా ప్రారంభించారు.