హోలీ సంబురాల్లో అంబటి రాంబాబు..!

-

ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు.. ప్రతిపక్షాలకు కౌంటర్ ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల భోగి వేడుకల్లో మంత్రి అంబటి డ్యాన్స్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం సత్తెనపల్లిలో అంబటి రాంబాబు హోలి సంబరాలో పాల్గొని ఫుల్ ఎంజాయ్ చేశారు.

హుషారుగా కనిపించిన అంబటి స్థానికులు ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉట్టి కొట్టి కాసేపు స్థానికులతో సరదాగా గడిపారు. అక్కడే ఉన్న మహిళలు చిన్నారితో డ్యాన్స్ చేయాలని కోరగా.. సై అంటూ స్టెప్పులు వేసి అలరించారు. ప్రస్తుతం అంబటి హోలి సంబరాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తండా వాసులు మంత్రి అంబటి రాంబాబుపై హోలీ రంగులు చల్లారు. దేశ వ్యాప్తంగా ఇవాళ హోలీ సంబరాలు ఆకాశాన్నంటేలా జరుగుతున్నాయి. రంగులు చల్లుకుంటూ ఈ పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version