ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

-

ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా ప్రతినిధి అమిత్ షాను ఏపీలో పొత్తుల గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుంది. ఎన్టీఏలోకి మిత్రులు వస్తుంటారు.. వెళ్తుంటారు. ఈసారి ఏపీ నుంచి కొత్త మిత్రులు వస్తున్నారు. రాజకీయంగా కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కొంత మంది బయటికి వెళ్లిపోవచ్చు.

పొత్తు ధర్మాన్ని మేము ఎప్పుడూ ఉల్లంఘించలేదు అని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ సిద్దాంతాలూ ఎప్పుడ మారలేదు అని స్పష్టం చేశారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు పరిశీలిస్తుంటే.. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహగానాలు కూడా వినిపించడం గమనార్హం. లోక్ సభలో కూడా వైసీపీ ఎంపీ అభ్యర్థులు బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఢిల్లీకి చంద్రబాబు వెళ్లి వచ్చిన తరువాత వెంటనే ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version