నిన్న ఇంటర్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మాములుగా నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను కొన్ని సాంకేతిక కారణాల వలన కాస్త లేటుగా బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఫలితాలలో అమ్మాయిలు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించినట్లుగా ఫలితాలు చెబుతున్నాయి.
కాగా ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షకు హాజరయిన వారిలో 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా , రెండవ సంవత్సరంలో 72 శాతం మంది పాస్ అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాలపై కీలక ప్రకటన చేశారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మే నెలలో పదవ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. అలాగే, ఇంటర్ పాసైన పిల్లలను ట్రాక్ చేస్తున్నామని.. ఉన్నత విద్య లో జాయిన్ అయ్యారా లేదా అన్నది చూస్తున్నామని చెప్పారు.