ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో కందిపప్పును సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు సరిపడా స్టాక్ ను చేరవేసింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 150- రూ. 180 వరకు ఉండగా, రేషన్ షాపుల్లో రూ. 67 కు అందిస్తోంది. కందిపప్పుతో పాటు చక్కెర, గోధుమపిండిని కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
ఇక అటు నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి వచ్చే వారం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగే సుదీర్ ఎక్స్ లో వెల్లడించారు. వచ్చే బుధవారం అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీల వివరాలు సమర్పిస్తాయని తెలిపారు. జీవో 77 అమలుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పారు.