ఏపీ ఇంటర్ సప్లీమెంటరీ పరీక్షల తేదీలు ఖరారు

-

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీయట్ మొదటి, ద్వితీయ సంవత్సరానికి చెందిన పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకే సమయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. అయితే మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఈ  ఫలితాల అనంతరం సప్లిమెంటరీ పరీక్షా తేదీలను కూడా ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నది. కాగా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నది. సెకండ్ ప్లేస్ గుంటూరు, థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి. ఫలితాలను తట్టుకోలేక క్షణికావేశంలో ఏమైనా చేసుకునే విద్యార్థులకు తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం మనోధైర్యం కల్పించాలని విద్యాశాఖ అధికారులు
తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version