మద్యం షాపుల దరఖాస్తులపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన..వారికి మరో అవకాశం !

-

మద్యం షాపుల దరఖాస్తులపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటలలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్. మద్యం షాపుల దరఖాస్తులకు నేడు తుది గడువు ఉందని… సాయంత్రం 7 గంటల వరకు ఆన్ లైన్లో కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్.

AP Wine Shops Bandh Decision Delayed Due to Floods

రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటలలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపునకు అవకాశం ఉంటుందని తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్. బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారు సాయంత్రం 7 గంటలలోపు క్యూ లైన్ లో ఉంటేనే అవకాశం ఉందన్నారు. సంబంధిత పత్రాలతో సాయంత్రం 7 గంటల్లోపు SHOల్లో అందుబాటులో ఉన్నవారికి టోకెన్లు అందించి క్రమ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ చేస్తారని కూడా తెలిపారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్. దరఖాస్తు దారులు నిబంధనలు పాటించి సజావుగా కార్యక్రమం ముగిసేలా సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version