నా పదవి పోయినా పర్వాలేదు.. ఆ స్థలం లీజుకు ఇచ్చేది లేదు..!

-

నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఖాళీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టరు డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేసాడు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అవసరమైతే నా పదవి పోయినా పర్వాలేదు.. కానీ ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇచ్చేది లేదు అని స్పష్టం చేసారు. రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించాం. దీనిని ఆర్టీసీకే వినియోగించాలి.

ఇది ప్రజల స్థలం.. ప్రజలే దీనిని కాపాడుకోవాలి. ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే.. ప్రస్తుతం ఎవరో వచ్చి వ్యాపారం చేయడమేంటి..? గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ఈ విషయం ప్రస్తావించా. అయితే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు మట్టి వేసినా విషయం తెలిసినా డిపో మేనేజరు ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగారు. దీన్ని బట్టి చూస్తే డిపో మేనేజరు, కాంట్రాక్టరు కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఇక్కడ ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి పనులు ఆపాలి. ఆలాగే ఆర్టీసీ స్థలంలో మట్టిని తరలించిన కాంట్రాక్టర్ పై పోలీస్ కేసును పెట్టాలని 24 గంటల్లో యాక్షన్ తీసుకోవాలని ఆ సమాచారాన్ని నాకు ఇవ్వాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ను ఆదేశించారు అయ్యన్నపాత్రుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version