మూడు ఏళ్లలో వైసీసీ ప్రభుత్వం విద్యారంగానికి మంచి చేశామని… చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా విద్యారంగాన్ని పట్టించుకోలేదని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అరకొర రీఎంబర్స్మెంట్ ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో విద్యాదీవెన వంటి పథకాలు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే జీర్ణించుకోలేక ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి వీటితో పాటు చంద్రబాబు కలిసి ఓ సిండికేట్, దొంగలముఠా అని విమర్శించారు. మహాభారతంలో దుష్ట చతుష్టయంగా వీరు మారారని జగన్ విమర్శించారు.
మహాభారతంలో దుష్ట చతుష్టయంగా ఆ నలుగురు: సీఎం జగన్
-