జగన్‌ సర్కార్‌ కు బండి శ్రీనివాసరావు వార్నింగ్‌

-

జగన్‌ సర్కార్‌ కు ఏపీఎన్జోఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వార్నింగ్‌ ఇచ్చారు. పిఆర్సీకి సంబందించి ప్రభుత్వానికి 11 డిమాండ్ చేశామని.. వాటికి ప్రభుత్వం 8 జివోలువిడుదల చేసిందని వెల్లడించారు. ప్రభుత్వం డిఏల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని.. పిఆర్సీకి సర్వీసు ఎరియస్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 27 ఐఆర్ 23 ఫిట్ మెంట్ నిర్ణయంచటం వల్లన 4 పర్సెంట్ తేడా వచ్చిందన్నారు.

కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయోపరిమితి పెంచాలని.. సిపియస్ విదానంపై
సియం హమీ నేరవేర్చలేదని ఆగ్రహించారు. Cps రద్దు చేసి ops విధానాన్ని అమలు చేయాలని.. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు ఇచ్చి వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఐఆర్ ఆప్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి… పోలీసు వ్యవస్థలో పని చేస్తున్న వారిని దూరంగా
డ్యూటీ వేసిన వారికి డిఏ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాన్ ఫైనాన్షియల్ 71 డిమాండ్లపై సమావేశం ఏర్పాటు చేయాలి.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి హెల్త్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news