నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ఇవాళ సాయంత్రం 5గంటలకు ప్రారంభించనున్నారు మంత్రి లోకేష్. ఈ కార్యక్రమానికి అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. భారీ పెట్టుబడులతో మల్లవల్లిలో బస్సు ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ప్రారంభంతో రాష్ట్రానికి మరో కీలక పరిశ్రమ రానుంది.
ప్లాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ రంగానికి జోష్ రానుంది. మల్లవల్లి యూనిట్ నుంచి దేశవ్యాప్తంగా బస్సుల సరఫరా ఉంటుంది. పరిశ్రమల విస్తరణలో మరో మెట్టుపై ఏపీ నిలువనుంది. తొలివిడతలో 600మందికి, మలివిడతలో 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.