టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ” జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, సచ్చే వరకు కొట్టాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అతనికి అపారమైన జన, కుల బలం ఉందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీ నేతలలో చర్చించారు ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు. నేను చెప్పింది కరెక్ట్ గా రిసీవ్ చేసుకోండి అంటూ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఇక దీనిపై వైసీపీ పార్టీ సీరియస్ అవుతోంది. జగన్ ను ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు తిట్టడం పట్ల మండిపడుతోంది.