బీటెక్ రవిని కిడ్నాప్ చేసి…మర్డర్‌ కు భారీ ప్లాన్‌ !!

-

టిడిపి నేత బీటెక్ రవి అరెస్ట్‌ పై బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపేయాలని అనుకున్నారని బిజెపి నేత సీఎం రమేష్ ఆరోపించారు. అరెస్టు చేసిన తర్వాత నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటలపాటు తిప్పారని అన్నారు. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్న బీటెక్ రవితో సీఎం రమేష్ ములకత్ అయ్యారు.

BTech Ravi remanded for 14 days

అనంతరం సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ….”బీటెక్ రవిని ఈ నెల 14న కడప నగర శివార్లలో వాహనంలో నుంచి దింపి పోలీస్ వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు. ఆ తర్వాత పాడబడ్డ భవనంలోకి తీసుకెళ్లి నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారు. బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది అని హెచ్చరించారు” అని ఆరోపించారు. రూల్స్ ప్రకారం ఎవరినైనా అరెస్టు చేస్తే వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అలా చెప్పకుండా బీటెక్ రవిని కిడ్నాప్ చేసి చంపేయాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. అయితే వారి ప్లాన్ ఫెయిల్ అయిందని మీడియా వల్ల బీటెక్ రవి బతికి బయటపడ్డాడని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version