స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తాజాగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయొద్దని సీఎం జగన్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయమని.. కూటమి నేతలు ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసానని గంటా చెప్పారు. రాజీనామా చేసిన గంటా.. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో ఎలా జత కడతారు అని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే కుటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదు అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చాలని కోరుతూ పురందేశ్వరి లేఖలు రాస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ఇదే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయలేదా? అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొలగించి హెరిటేజ్, మార్గదర్శి మేనేజర్లను ఎన్నికలు అధికారులుగా నియమించాలని పురందేశ్వరిని లేఖలు రాయమనండి. కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? చంద్రబాబు, పురందేశ్వరి ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వేసిన ప్రజలు నమ్మరు అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.