ఆంధ్ర ప్రదేశ్‌ లో మధ్యంతర ఎన్నికలు ?

-

ఆంధ్ర ప్రదేశ్‌ లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రకటించారు. మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే…..అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ళ తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు.

YSRCP Vijayasai Reddy

అటు కొత్త ఛానల్‌ పెడుతున్నట్లు ప్రకటించారు రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి. శాంతి వివాదంపై విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ…త్వరలోనే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని వెల్లడించారు. గతంలోనే ప్రకటించిన ఆలస్యం చేసినందుకు బాధపడుతున్నానని… ఎవరు అడ్డువచ్చిన ఛానల్ ఏర్పాటు లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కులాలికి, మతాలికి, రాజకీయ పార్టీలకు అతీతంగా న్యూట్రల్ ప్లాట్ ఫార్మ్ మీద పని చేస్తుంది…..తప్పులు చేసే వాళ్ళను వదలమన్నారు. ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ అస్తుల రక్షణ కోసం పనిచేశాను…ఎటువంటి చర్యలకు అయిన సిద్ధమని వెల్లడించారు. టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై మా పార్టీ వాళ్ళే నా మీద ఆరోపణలు చేయించారు…..అయినా నేను బాధపడలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version