వరద బాధితులకు గుడ్ న్యూస్.. నష్టపరిహారం ప్రకటించిన చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడీయాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించారు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం.వరదల్లో ప్రజలు నరకయాతన అనుభవించారు. దాతలు చాలా మంది ముందుకు వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. చరిత్రలో తొలిసారి ఒక ఇంటికి రూ.25వేలు ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వారికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందిస్తాం.

179 సచివాలయాలు, 39 వార్డుల్లోని గ్రౌండ్ ఫ్లోర్ లోని వారందరికీ  రూ.25వేల సహాయం అందిస్తాం. గతంలో రూ.4వేలు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఇండ్లలోకి నీరు వచ్చినా రూ.10వేలు ఆర్తిక సహాయం అందిస్తామని తెలిపారు. నష్టపోయిన పరిశ్రమలకు టర్నోవర్ ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. నష్టపోయిన ఆటో డ్రైవర్లందరికీ  రూ.10వేలు అందిస్తున్నాం. పుష్ కార్డులు ప్రీ కొని వారందరికీ అందజేస్తామని హామి ఇచ్చారు. 2 వీలర్స్ కి రూ.3వేలు అందజేస్తామని తెలిపారు. చేనేత కార్మికులు పూర్తిగా నష్టపోతే వారికి రూ.25వేలు ఆర్తిక సాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version