రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల చివరలో మూడు స్థానాలకు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లోపోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. ఈ మేరకు పోటీపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా బలం లేకపోయినప్పటికీ టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తోందని వార్తలు వినిపించాయి. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ సైతం రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ ఉంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులలో గందరగోళం నెలకొంది. బలం లేకపోయినప్పటికీ ఎలా పోటీ చేస్తారని.. కన్ఫూజన్ నెలకొంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీపై వస్తున్న వార్తలకు తాజాగా బాబు చెక్ పెట్టారు. రాజ్యసభ ఎన్నికల బరిలో టీడీపీ ఉంటం లేదని ప్రకటించడంతో… నేతల్లో నెలకొన్న అయోమయానికి పుల్ స్టాప్ పడింది.