నేడు అమలాపురంలో చంద్రబాబు పర్యటన

-

ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 10 గంటలకు మహిళలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం 4 గంటలకు భవిష్యత్తుకు గ్యారెంటీ పాదయాత్ర చేపడతారు.

అమలాపురం వేంకటేశ్వరస్వామి గుడి వద్ద నుండి గడియార స్థంభం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు గడియార స్థంభం సెంటర్ లో భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు. అనంతరం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లతారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version