సొంతిల్లు అడిగిన మహిళ.. హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీపం 2 పథకంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్దిదారు శాంతమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లి.. ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం జానకమ్మ అనే మహిళకు ఒంటరి మహిళా పింఛన్ అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు సీఎం చంద్రబాబును జానకమ్మ సొంత ఇల్లు అడిగారు. ఇల్లు కట్టిచ్చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. రేపటి నుంచే మీ ఇంటి పని ప్రారంభిస్తామని చెప్పారు చంద్రబాబు. రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు సీఎం. డ్వాక్రాలో లీడర్ గా ఉన్నావు పది రూపాయలు సంపాదించుకోవాలి కదా అమ్మ అని జానకమ్మకు సీఎం సలహా ఇచ్చారు. థైరాయిడ్, డయాబెటిక్ కు జనరిక్ మెడిసిన్స్ ఉంటే చూడాలని కలెక్టర్ కు చంద్రబాబు సూచించారు. రూ.500 నుంచి రూ.4000 వరకు అందుకుంటున్నాను. మీరు మాకు దేవుడు అని చంద్రబాబుతో జానకమ్మ పేర్కొంది. 20 ఏళ్లుగా పేదరికంలో మగ్గుతున్నామని సీఎంతో జానకమ్మ అనగా.. ఆమెను ఓదార్చారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version