10 వ తరగతి టాపర్లకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. గవర్నమెంటు స్కూళ్లలోని టెన్త్ టాపర్లకు ఏపీ సీఎం వైయస్.జగన్ బొనాంజా అందించనున్నారు. ఏపీ నియోజకవర్గాల్లోని టాపర్లకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
గవర్నమెంటు స్కూళ్లలో టెన్త్‌లో టాప్ విద్యార్థులకు ప్రోత్సాహకాల విస్తరణ చేయపట్టనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, జిల్లాస్థాయి టాపర్లకే కాకుండా నియోజకవర్గాల వారీ టాపర్లరూ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 1,2,3 స్థానాల్లోని విద్యార్థులకు వరుసగా రూ. 15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.