ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉండనున్నారు. రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు సీఎం జగన్. ఈ సమావేశంలో పాల్గొనడమే కాకుండా ప్రధాని మోదీ, అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో ఏపీకి రావలసిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గురించి సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది.
ఇక ఎల్లుండి నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్. అనంతరం ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. ఐతే గతంలో జగన్ ఢిల్లీకి వెళ్ళినా.. ఈసారి పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రధాని, అమిత్ షా తో సీఎం జగన్ సమావేశంలో ఏపీలోని రాజకీయ అంశాల పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.