AP CM Jagan Tour : నేడు పుట్టపర్తి పర్యటనకు సీఎం జగన్‌..షెడ్యూల్‌ ఇదే

-

AP CM Jagan Tour: నేడు పుట్టపర్తి పర్యటనకు సీఎం జగన్‌ పయనం కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ రిలీజ్‌ చేశారు అధికారులు. ఇవాళ పుట్టపర్తి లో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…హెలికాప్టర్‌ మార్గంలో వెళతారు.

CM Jagan to visit Puttaparthi today

ఇక షెడ్యూల్‌ ప్రకారం…ఇవాళ ఉదయం 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం లో బయలుదేరి 10: 15 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. 10:40 గంటలకు వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. మధ్యాహ్నం 12:15కి రైతులకు వైయస్సార్ భరోసా, పిఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక ఇవాళ వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున ఆర్ధిక సహాయం చేయనున్నారు. దీంతో 53.53 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఈ సందర్భంగా రూ.2,204.77 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version