మెడికల్ షాప్ లో కరోనా టెస్ట్, తాట తీస్తున్న పోలీసులు…!

-

కృష్ణా జిల్లా నూజివీడులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అనధికార కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూజివీడులో ప్రయివేట్ ఆసుపత్రులు, రక్త పరీక్షల ల్యాబ్ లపై మెరుపు దాడులు చేసారు స్థానిక పోలీసులు. జ్వరాల రోగులకు కరోనా నిర్ధారణకు 1500 నుండి 2500 వరకు ప్రయివేట్ మెడికల్ మాఫియా వసూలు చేస్తుంది.

స్థానిక మెడికల్ షాపుల్లో భారీగా కోవిడ్ పరీక్షల కిట్లు స్వాధీనం చేసుకున్నారు. కొందరు డయాగ్నోస్టిక్ ల్యాబ్, మెడికల్ షాప్ ల యజమానులను అదుపులోకి తీసుకున్నారు. కరోన కిట్ లు ఎక్కువగా సరఫరా అవుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు. కరోనా వైరస్ పరీక్షలకు ప్రయివేట్ ఆసుపత్రులు, ల్యాబ్ లకు అనుమతులు లేవనీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వారిని స్టేషన్ లో పెట్టి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news