డిస్కష‌న్ పాయింట్ : కాగ్ చెబితే వినాలి..!

-

కోర్టు భ‌వ‌నాల‌కు రూపాయి ఇవ్వ‌లేదు.. అయినా నో కామెంట్ ..ఎందుకంటే రాష్ట్ర స‌ర్కారు కు వాటికి ఇవ్వాల్సిన ఆవ‌శ్య‌క‌త లేదు క‌నుక అని స‌ర్దుకుపోవాలి. ప‌ద్దుల్లో లెక్క‌తేల‌నివి ల‌క్ష కోట్లకు పైగా అని మీరు అన్నారే అనుకోండి ఆదాయం లేని రాష్ట్రం అప్పులు చేయక ఏంచేయాలి అని ఎదురు ప్ర‌శ్న ఒక‌టి వ‌చ్చి నేరుగా తాకుతుంది. క‌నుక ఖ‌ర్చుల లెక్క అడిగితే క‌న్నీటి క‌థ‌లు చెప్తారేంటో
అని కూడా మీరు అనుకోవ‌ద్దు. ఏమంటే ఏడాదికి యాభై ఐదు వేల కోట్ల రూపాయ‌లు కేవ‌లం న‌గ‌దు బ‌దిలీకే వెచ్చిస్తున్నారు.

ఆ విధంగా ఓ రోడ్డుకు కానీ ఓ వంతెన‌కు కానీ నిధులే లేవు. కేటాయింపులే లేవు. విడులే లేదు. అలాంట‌ప్పుడు కాగ్ నివేదిక చెప్పిన విష‌యాల‌పై వైసీపీ ఏ విధంగా త‌నదైన అనుకూల భాష్యం ఇచ్చుకుంటుంద‌ని ? లోటు ఉన్నా రుణాల చెల్లింపున‌కు ప్రాధాన్యం ఇస్తున్న స‌ర్కారు ఇదే అని ఇవాళ జ‌గ‌న్ అనుకూల మీడియా సాక్షి రాసింది. అంటే కాగ్ నివేదిక అన్న‌ది వెల్ల‌డి అయ్యాక‌ ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన విధంగా వివ‌ర‌ణ‌ను మ‌రియు విశ్లేష‌ణను ఇవ్వొచ్చు అన్న మాట !

ల‌క్ష కోట్ల రూపాయ‌ల చుట్టూ గ‌తంలో చాలా రాజ‌కీయం న‌డిచింది. ల‌క్ష కోట్ల రూపాయ‌ల మేర‌కు జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులు ఉన్నాయ‌ని అప్ప‌ట్లో పెద్ద క‌థే న‌డిచింది. త‌రువాత న‌ల‌భై కోట్ల రూపాయ‌లే జ‌గ‌న్ అక్ర‌మాస్తుల విలువ అని తేలింది. ఆ త‌రువాత ఎంత మొత్తానికి తేలిందో కూడా తెలియ‌కుండానే ఉంది.ఈ ద‌శ‌లో తాజాగా కాగ్ సీన్ లోకి వ‌చ్చింది. ఆడిటింగ్ రిపోర్ట్ ఒక‌టి ఇచ్చింది.
రాష్ట్రంలో అప్పులు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఉన్నాయి అని ఎప్ప‌టి నుంచో గ‌గ్గోలు పెడుతున్న విప‌క్షానికి కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ క్లుప్తంగా కాగ్ చెప్పిన మాటలు ఆయుధం కానున్నాయి.

ప‌ద్దులో ఉన్న వాటికి ప‌ద్దులో లేని వాటికి చాలా వ్య‌త్యాసాలు ఉన్నాయ‌ని తేలింది. బ‌డ్జెటేత‌ర వ్య‌యం ల‌క్షా ప‌ది వేల కోట్ల రూపాయ‌లు అని తేలింది. దీంతో ఈ మొత్తం వేటికి ఖర్చు చేశారో చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వం పై ఉంది. ముఖ్యంగా ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు వెళ్ల‌కుండా రాష్ట్రాన్ని న‌డ‌ప‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌ని పని అని తేలిపోయింది. తాజా నివేదిక ప్రకారం గ‌త ఏడాది 103 రోజుల పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం ఓవ‌ర్ డ్రాఫ్ట్ తోనే కాలం వెళ్ల దీసింద‌ని తేల్చేసింది. ఈ ద‌శ‌లో ప్ర‌భుత్వం వినిపించే సంక్షేమ సూత్రాలు ఏమ‌యిపోతున్నాయి..వాటికి వెచ్చించే డ‌బ్బు ఎక్క‌డి నుంచి ఎక్క‌డి దాకా వెళ్తుంది అన్న‌ది కూడా తేలాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version