శ్రీకాకుళం : గృహానిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధ రాజు ఆసక్తి కర వ్యాఖ్యలు కామెంట్స్ చేశారు. జగనన్న కాలనీలను పరిశీలించిన గృహా నిర్మాణ శాఖా మంత్రి శ్రీరంగనాధరాజు… అనంతరం మాట్లాడారు. పేదలకు ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ , ఎన్టీఆర్ , వైఎస్సాఆర్ మాత్రమేనని చెప్పారు. నేడు జగన్ నాయకత్వంలో 32 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నామని ప్రకటన చేశారు.
రూ. 12000 కోట్లతో భూసేకరణ చేయటం సామాన్యమైన విషయం కాదని తెలిపారు. పేదలకు ఇల్లు ఇవ్వడం ఇష్టం లేని వారు కోర్టులలో పోరాడుతున్నారని వెల్లడించారు. లబ్దిదారులకు కరెంటు, వాటర్, ఇసుక అన్నీ అందిస్తున్నామని చెప్పారు. అంపోలులో 1100 ఇల్లు జూన్ నాటికి పూర్తి అవుతాయనే నమ్మకం ఉందని మంత్రి శ్రీరంగనాధ రాజు చెప్పారు.
నాడు-నేడు, ధాన్యం కొనుగోళ్లు , ఉపాధి హామీ పథకం, హోసింగ్ తదితరుల అంశాలు పై చర్చించామని.. ఏమైనా సమస్యలు ఉంటే.. అన్నిటిని క్లియర్ చేయమని అధికారులను అదేశించామని ప్రకటించారు. బీమ్లా నాయక్ సినిమా టికెట్స్ విషయంపై స్పందిస్తూ మనం ఒక వ్యవస్థలో ఉన్నామని వెల్లడించారు. చట్టం ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.