2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2,86,389 కోట్లతో బడ్జెట్ – బుగ్గన

-

ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ మేరకు అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. ఈ సందర్భంగా మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన బుగ్గన..2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2,86,389 కోట్లతో బడ్జెట్ పెడుతున్నట్లు వెల్లడించారు.

2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2,86,389 కోట్లతో బడ్జెట్ – బుగ్గన

ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కిందన్నారు. మేనిఫెస్టోను సీఎం జగన్‌ పవిత్ర గ్రంథంగా భావించారన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రూ. 2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం అని… రూ.30,530 కోట్ల మూలధన వ్యయం అని బుగ్గన తెలిపారు. రూ.24,758 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఉంటుందని.. రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు అని.. రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 1.56 శాతం అని తెలిపారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version