ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏపీ తీరాన్ని తాకినట్లు వెల్లడించింది. తాజాగా రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని తెలిపింది. రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ఎంటరైన నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని, భారీ వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అయితే, ఈ నెల 4, 5 తేదీల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తాయని మొదట వాతావరణ శాఖ అంచనా వేయగా.. అంచనాలకు రెండు రోజులు ముందే నైరుతి ఏపీ తీరాన్ని తాకింది. ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు స్టార్ట్ చేస్తోన్న రైతులు వాతావరణ శాఖ చెప్పిన స్వీట్ న్యూస్ తో ఖుషీ అవుతున్నారు.