ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలన పరంగా పేదలకు ఏ అవసరం ఉంటుందో అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు అన్న క్యాంటిన్ల పున:ప్రారంభం వంటి కీలక బిల్లులపై సంతకాలు చేశారు చంద్రబాబు.
నెల రోజుల కిందటే కూటమి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించింది. తాజాగా మరోసారి తగ్గించాలని భావిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల రోజుల్లో నిత్యావసర సరకుల ధరలు రెండుసార్లు తగ్గించాం. నిత్యావసర సరకుల ధరలు మరోసారి తగ్గించాలని నిర్ణయించాం. బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలు మరో దఫా తగ్గిస్తాం. బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర రూ.160 నుంచి 150 కి తగ్గింపు. బియ్యం రూ.48 నుంచి 47, స్టీమ్డ్ రైస్ రూ.49 నుంచి రూ.48కి తగ్గింపు. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు.