చంద్రబాబు నాయుడుకి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాజకీయంగా, పరిపాలనపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా దృఢ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ ప్రభుత్వం బనాయించిన కేసులతో కారాగారంలో ఉన్నప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా’ తెలిపారు. 

మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని సామగుట్ట పల్లె వద్ద ఉన్న కదిరిబండ నరసింహ స్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం  కేక్ కట్ చేసి ప్రత్యేకంగా సంబురాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లాలోని కణేకల్ లో విద్యార్థులు, టీడీపీ నాయకులతో కలిసి చంద్రబాబు కేకు కోశారు. చంద్రబాబు జన్మదిన వేడుకలు తిరుమలలో కూడా ఘనంగా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version